MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటు ద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో శుక్రవారం సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషి చేయాలని సూచించారు.