SKLM: పొందూరు ఖాదీ కి GI ప్రతిష్టాత్మక ట్యాగ్ లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. శ్రీకాకుళం వాసిగా ఇది తనకు ఎంతో గర్వించదగ్గ క్షణమన్నారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత పొందూరు ఖాదీకి GI ట్యాగ్ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.