KNR: అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంఅండొచ్ఐ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య సంరక్షణ హక్కులు, ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు.