ADB: వందశాతం పోలింగ్ నమోదు అయ్యేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. రెండవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై అధికారులకు గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటర్లకు పోలింగ్ కేంద్రం వివరాలు తెలియజేయాలన్నారు.