ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి మండల కేంద్రంలో శనివారం పర్యటించనున్నట్లు టీడీపీ మండం నాయకులు తెలిపారు. శనివారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు చెప్పారు. కూటమి శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.