VZM: గజపతినగరం టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై వినతులు అందజేశారు. ప్రధానంగా కాలనీల్లో రోడ్లు కాలువలు ఏర్పాటుతో పాటు తాగునీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, లెంక చిన్నం నాయుడు పాల్గొన్నారు.