ADB: రూరల్ మండలంలోని యాపాలగూడ గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ అనుముల ఆశన్న ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యాన్ని పంచుతూ పట్టుబడ్డట్లు ఎస్సై విష్ణువర్ధన్ శనివారం తెలియజేశారు. ఆశన్న వద్ద నుంచి 30 క్వార్టర్ బాటిల్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని తెలియజేశారు.