SKLM: పలాస-కాశీబుగ్గలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, దుకాణాలు, పలు ప్రాంతాల్లో పోలీసులు జాగిలాల తో శుక్రవారం సాయంత్రం సీఐ రామకృష్ణ పర్యవేక్షణలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు తదితర మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అన్నారు.