‘ధురంధర్’ సినిమా తన హృదయానికి హత్తుకుందని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పోస్ట్ పెట్టాడు. దీనిపై తాజాగా ఆ మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించాడు.’ఈ మూవీపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రశంసలకు ఈ సినిమా కోసం కష్టపడిన వారందరూ అర్హులే. దీనికి పార్ట్ 2 వస్తుంది. అది తీసేటప్పుడు అందరి సూచనలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాం’ అని అన్నాడు.