PPM: మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, కడకెల్ల గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ మరడాన శంకరరావును రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా శంకర్రావుకు స్వయంగా ఫోన్ చేసి రైతులకు శంకరరావు ఉపయోగపడుతున్న తీరుపై మంత్రి ప్రశంసలు వర్షం కురిపించారు.