VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్‌తో ఇవాళ నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధా మూర్తి హాజరవుతారు. అలాగే ఏయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, జీఎంఆర్ అధినేత జి.ఎం.రావు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.