SKLM: మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురు వ్యక్తుల పైన నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు కి టెక్కలి కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించినట్లు నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ అలీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరోసారి పట్టు పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.