NLR: కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరం రుజువుకావడంతో నిందితుడు చల్లా దశరథకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై తెలిపారు. 2020లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురిని బైకుపై తీసుకెళ్లి నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలోని నిమ్మ తోటలో అత్యాచారం చేసినట్లు తెలిపారు.