SRD: కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని ఖేడ్ MLA సంజీవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి హనుమంతరావుపేట్, లింగాపూర్, మాధ్వార్ తాండ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందేలా ప్రతి కార్యకర్త ప్రచారం చేయాలనన్నారు.