NZB: రెండవ విడత పంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. అంతర్రాష్ట్ర, అంతర జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పకడ్బందీగా నిర్వహించాలని పోలీసు అధికారులకు ఆయన ఆదేశించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు.