ప్రకాశం: జిల్లాలోని పాస్టర్లకు మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలను గవర్నమెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్ల ఇవ్వాలని తెలిపారు.