KNR: చిగురుమామిడి మండలంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఘటన వెలుగులోకి వచ్చింది. పొలం గట్టు దాబా వద్ద రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన బిర్యానీ పాకెట్లు, బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఎవరు వీటిని సరఫరా చేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.