NLR: ఉదయగిరి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఎంపీపీ మూలె పద్మజ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు తప్పక హాజరు కావాలన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగుతుందన్నారు.