GDWL: గట్టు మండలం మాచర్లలో జరిగిన ఎన్నికల్లో నోటా గుర్తుపై 123 ఓట్లు పోలవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా తక్కువగా నమోదయ్యే నోటా ఓట్లు ఒకే గ్రామంలో ఇంత పెద్ద సంఖ్యలో నమోదవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాన అభ్యర్థుల పట్ల గ్రామస్థుల నిరసన లేదా అసంతృప్తి దీనికి కారణమని విశ్లేషణలు జరుగుతున్నాయి. మాచర్లలో మొత్తం 3966 ఓట్లు ఉండగా, 2696 ఓట్లు పోలయ్యాయి.