సత్యసాయి: జిల్లా ఎస్పీ S.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి పరిగి మండలంలోని శాసనకోట గ్రామ సమీపంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పరిగి ఎస్సై రంగడు, సిబ్బంది కలిసి ఏడుగురు పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 34,500 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.