AKP: వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నక్కపల్లి మండలానికి చెందిన సురకాసుల గోవిందు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. రైతు సమస్యలపై పోరాటం చేస్తానని గోవిందు ప్రకటించారు అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.