NZB: ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1000 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుప్పాల రవి, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివమాదిగ, లక్ష్మణ్ పాల్గొన్నారు.