VZM: కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఒక వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో నిన్న మృతి చెందారు. అయినా ఆయన కుటుంబం శోకంలోనూ మానవీయతను చాటింది. చీపురుపల్లికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీవో కర్రోతు అప్పారావు (73) శుక్రవారం కంటి పరీక్షల కోసం విజయనగరానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాదంలోనూ కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించారు.