NLR: లేడీ డాన్ నిడిగుంట అరుణ బయటికి వస్తే మళ్లీ నేరాల బాట పట్టే అవకాశం ఉందని, అందుకే పీడీ యాక్ట్ నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఆమెకు ఏడాది పాటు బెయిల్ రాదని.. ఎవరినీ కలిసే అవకాశం ఉండదన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.