ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడతలో జరిగే ఎన్నికలకు ఇంకా మరో 24 గంటల సమయమే ఉంది. 27 మండలాల్లోని 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, ఇప్పటికే 56 జీపీలు ఏకగ్రీవం, మిగతా 508 జీపీలకు 1,686 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 4,937 వార్డుల్లో 917 ఏకగ్రీవమవ్వగా, మిగిలిన 4,020 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 9,884 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.