NZB: ఈనెల డిసెంబర్ 18, 19 తేదీలలో జరిగే కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయ సమావేశాలను తాత్కాలిక వాయిదా వేయాలని రాష్ట్రస్థాయి సెకండరీ గ్రేడ్ టీచర్ యూనియన్ కోరింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యా సంచాలకులకు శుక్రవారం సాయంత్రం వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో జరిగే గ్రామపంచాయతీ 3వ విడత ఎన్నికలు 17వ తేదీ ముగుస్తుంది. కావున వాయిదా వేయాలని కోరారు.