AP: రాష్ట్రంలో గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఇవాళ విజయవాడలో 100 గుడ్ల ధర అత్యధికంగా రూ.690గా ఉండగా.. అనపర్తి, తణుకులో రూ.665, విజయనగరం శ్రీకాకుళంలో రూ.664, చిత్తూరులో రూ.663, విశాఖలో రూ.660గా ఉంది. రిటైల్లో రూ.8-10కి అమ్ముతున్నారు. గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది.