AKP: మునగపాక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం.దేవికి ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ అవార్డు లభించింది. శుక్రవారం ఆమెకు అవార్డును అనకాపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేసి అభినందించారు. పోలీస్ సిబ్బంది అంకితభావం చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.