VSP: కూర్మన్నపాలెం భరత్ నగర్లో శుక్రవారం సాయంత్రం ఓ యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. మృతుడు అల్లూరి జిల్లా పెద్దజాడుమూరు సంకాడ పంచాయతీకి చెందిన వేములపూడి విజయ్ కుమార్ అలియాస్ నందుగా గుర్తించారు. ఘటనా స్థలానికి దువ్వాడ పోలీసులు చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.