విశాఖలో నాలుగు జిల్లాల ఎక్సైజ్ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఏడాది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యం పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యం నిర్మూలనలో ఏ మాత్రం ఉపేక్ష ఉండకూడదని స్పష్టం చేస్తూ, క్రమం తప్పకుండా దాడులు, పర్యవేక్షణను పెంచాలని సూచించారు.