SRCL: సమ్మక్క సారక్క సమీపిస్తున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి 24 గంటల పాటు నిరంతరాయంగా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారక్క జాతరకు ముందుగా వేములవాడకు రావడం ఆనవాయితీ. 2026 జనవరి 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఉద్యోగులు 24 గంటలలో మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వర్తించాలని అధికారులు తెలిపారు.