కాకినాడ: శంఖవరంలోని స్థానిక శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘ భవనంలో శనివారం ఉదయం 9 గంటల నుండి ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో అన్ని వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.