W.G: నరసాపురం వైఎన్ కళాశాలలో శుక్రవారం ఉద్యోగస్థులకు డివిజన్ స్థాయి గోదావరి క్రీడా సంబరాలు ప్రారంభించారు. ఈ పోటీలకు ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలకు ఆర్టీవో దాసిరాజు, డీఎస్పీ శ్రీవేదలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉద్యోగస్థులకు ప్రభుత్వం ఇటువంటి క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు.