TPT: బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన భాను 2017లో బీటెక్ పూర్తి చేశారు. కోచింగ్ లేకుండా 2016లోనే SI ఎగ్జాం రాయగా ఫెయిలయ్యారు. ‘అమ్మాయికి జాబ్ ఎందుకు పెళ్లి చేయండి’ అని అందరూ అవమానించారు. చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూనే రెండోసారి ప్రయత్నించగా పాస్ అయ్యారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నాయుడుపేటలో రెగ్యులర్ SIగా తొలి పోస్టింగ్ పొందారు.