SKLM: ప్రస్తుత రబీ పంటకు సంబంధించిన మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు అవసరమైన యూరియాను జిల్లాకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కె .త్రినాథ స్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంట విస్తీర్ణాన్ని బట్టి మండలాల్లోని రైతు సేవా కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు కొరత లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.