W.G: భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ శిబిరానికి హాజరైన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అందరిలో స్ఫూర్తిని నింపేందుకు స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం జేసీని కలెక్టర్ అభినందించారు.