KRNL: హాలహర్వి మండలంలో ఓటరు లిస్టులో ఎస్ఐర్ సర్వే వేగవంతం చేయాలని MRO లక్ష్మీనారాయణ ఆదేశించారు. MPDO కార్యాలయంలో నిర్వహించిన BLO సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో SIR సర్వే 52 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. దీనిపై ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి విచారణ చేయాలని సూచించారు. సర్వేపై నిర్లక్ష్యాన్ని చూపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.