అన్నమయ్య: రామసముద్రం మండలం ఎలకపల్లి గ్రామానికి చెందిన రాజప్ప (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కూలిపని ముగించుకుని స్వగ్రామానికి నడుచుకుంటూ వస్తుండగా, చల్లా చెరువు వద్ద కర్ణాటకకు చెందిన బైకు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై రాజప్ప అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.