KDP: పెళ్లయిన దంపతులు బియ్యం కార్డును దరఖాస్తు చేసుకోవాలంటే గతంలో పెద్ద ప్రక్రియ ఉండేది. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండదు. భార్యాభర్తల ఇద్దరి ఆధార్, భర్త పాత బియ్యం కార్డు, పెళ్లి ధ్రువీకరణ పత్రం తీసుకుని సచివాలయానికి వెళ్తే ప్రభుత్వ వెబ్సైట్లో మ్యారేజీ స్ల్పిట్ ఆప్షన్లో నమోదు చేస్తారు. VRO, MRO పరిశీలన పూర్తి అయ్యి అనుమతి పొందగానే కార్డు మంజూరు చేస్తారు.