AP: పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఆర్యవైశ్యుల తరపున సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. ‘ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మంత్రి మండలిలో నాకు అవకాశం కల్పించారు. ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు అండగా ఉంటారు’ అని పేర్కొన్నారు.