నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమటో గ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలో సర్పంచులుగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను శుక్రవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో వారు మంత్రిని కలిశారు.