AP: ఏలూరులో ఏర్పాటు చేయనున్న డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీకి అన్ని అనుమతులు వచ్చేలా కృషిచేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. అనుమతులు త్వరితగతిన ఇచ్చేలా చూడాలని యూజీసీకి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం అనుమతుల గురించి వర్సిటీ ఓఎస్డీ డా.వెలగ జోషి న్యూఢిల్లీలో ఎంపీని కలిసి వివరించారు.