KMM: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని వైరా ఎస్సై పుష్పాల రామారావు శుక్రవారం తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి సహకరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.