W.G: పాలకొల్లులో ఆర్. కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సదస్సు ఈ నెల 14వ తేదీన జరగనుంది. ఈ సదస్సుకు హాజరవ్వాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను నిన్న రాష్ట్ర అధ్యక్షుడు ముద్దాడ గణేష్ భవాని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సదస్సులో బీసీల భవిష్యత్ కార్యాచరణ చర్చిస్తామని, నూతన రాష్ట్ర కమిటీ ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు.