PPM: ప్రబుత్వ రేషన్ డిపోల వద్ద ధరల పట్టిక బోర్డు తప్పనిసరిగా ఉండాలని JC సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ధరల స్థితిగతులు, తూనికల కొలతల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ధరల నియంత్రణపై రోజువారీ మార్కెట్ పర్యవేక్షణ ఉండాలన్నారు.