సిద్దిపేటలోని SIP 11 కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉ. 9 గంటల నుంచి మ.1 గంట వరకు మారుతి నగర్, సాయిదీప్ నగర్, బృందావన్ కాలనీ, ఎన్ఐసీ కాలనీ, విద్యానగర్, కుశాల్ నగర్, ఆదర్శనగర్, మణికంఠ కాలనీ, శ్రీనివాస్ నగర్, సాజిత్పురా, మహాశక్తి నగర్ ప్రాంతాలలో అంతరాయం ఉంటుందని అన్నారు.