VSP:పెదగంట్యాడ న్యూపోర్టు పోలీస్ స్టేషన్ను నగర్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసుల స్థితిగతులు పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో సమావేశమై శాంతి భద్రతలు, ప్రజలకు మెరుగైన సేవలు, నేర నియంత్రణపై సూచనలు చేశారు.