ATP: జిల్లాలో కంది పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 8 వేలు మద్దతు ధర నిర్ణయించింది. నాఫెడ్ అనుమతి మంజూరు చేసిందని ఏపీ మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ పిన్నేశ్వరి తెలిపారు. కంది పండించిన రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే పంటను కొనుగోలు చేస్తారని నూచించారు.