AP: ఈనెల 24న మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం సచివాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శాఖల వారీ ప్రతిపాదనలను రూపొందించి ఈనెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు సాధారణ పరిపాలన శాఖలో అందజేయాలని అన్ని శాఖలకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.