BDK: పినపాక మండలంలోని బోటుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సీపీఎం, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నూప బాపనమ్మ విజయం సాధించారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ విజయం పట్ల బీఆర్ఎస్ నాయకులు బాణా సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.